Abn logo
Aug 3 2021 @ 22:34PM

సమస్యలు పరిష్కరించాలని నిరసన

పెంచికలపేటలో నినాదాలు చేస్తున్న ఆశా కార్యకర్తలు

పెంచికలపేట, ఆగస్టు 3: సమస్యలు పరిష్కరించాలని మంగళవారం దహెగాం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ఆవరణలో ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 11వ పీఆర్సీని ఆశాలకు వర్తింపజేయాలని కోరారు. తమను పర్మనెంట్‌ చేయడంతో పాటు కనీస వేతనం రూ.21 వేలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈఎస్‌ఐ, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని అన్నారు. కొవిడ్‌తో మృతి చెందిన ఆశాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని, స్మార్ట్‌ఫొన్‌, రిజిస్టర్స్‌, యూని ఫాంలు అందజేయాడని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశా కార్య కర్తలు అనసూర్య, శ్రీలత, సరోజన, లక్ష్మి, రాజశ్వరి, సత్తుబాయి, సుజా త, శ్వేత, సీఐటీయూ నాయకుడు ముంజం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
లింగాపూర్‌: పీఆర్సీ ప్రకారం ఆశా వర్కర్లకు వేతనాలు చెల్లించాలని మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మెడికల్‌ ఆఫీసర్‌ సంజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు రాజేందర్‌ మాట్లాడారు. పీఆర్సీ ప్రకారం వేతనా లు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.  కార్యక్రమంలో ఆ శా వర్కర్లు సునీత, ఓమాల, అర్చన పాల్గొన్నారు.