Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండో రోజూ నిరసన

 నల్లబ్యాడ్జీలతో  విధులకు హాజరు


కర్నూలు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): పీఆర్సీ సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన నిరసన కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. ఏపీఎన్జీవో నాయకులు బుధవారం కలెక్టరేట్‌లోని ప్రతి సెక్షనకు తిరుగుతూ నల్లబ్యాడ్జీలతో తమ నిరసనను తెలియజేశారు. నగరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పీఆర్సీతోపాటు మిగిలిన డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యోగులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా, తాలుకా కేంద్రాల్లో ఆయా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. నిరసన కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వీసీహెచ వెంగళ రెడ్డి, ఏపీఎన్జీవో జిల్లా కార్యదర్శి జవహ ర్‌లాల్‌, ఏపీఎన్జీవో నగర అధ్యక్షుడు ఎంసీ కాశన్న, ఏపీ రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన జిల్లా అధ్యక్షుడు గిరికుమార్‌రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, వెటర్నరీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన జిల్లా చైర్మన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement