Abn logo
Jun 2 2020 @ 04:03AM

విద్యుత్‌ సవరణ బిల్లుపై నిరసన

గద్వాలక్రైం, జూన్‌ 1 : విద్యుత్‌ సవరణ బిల్లు - 2020కు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ డివిజనల్‌, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సర్కిల్‌ కార్యాలయం ముందు సోమవారం విద్యుత్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీఎస్‌పీఈజేఏసీ) చైర్మన్‌ గంగాధర్‌ మోహన్‌ మాట్లాడుతూ ఈ వ్యవస్ధ కేంద్రం పరిధిలోకి వెళ్తే రైతులకు సబ్సిడీ ఉండదని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్‌పీఈజేఏసీ కన్వీనర్‌ నరసింహా ప్రసాద్‌, జేఏసీ నాయకులు శాలన్న, అంజనప్ప, మహేష్‌, విల్లమ్‌చారీ, రాజు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement