Oct 23 2021 @ 13:11PM

'ప్రాజెక్ట్-K': సూపర్ హీరోగా ప్రభాస్..!

నేడు (అక్టోబర్ 23) పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్ వచ్చు సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న 'ప్రాజెక్ట్-K' ఒకటి. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీపిక పడుకోణ్ హీరోయిన్. కాగా ఈరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వైజయంతీ మూవీస్ వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో.. 'సినిమాకి కొత్త సహస్రాబ్దిని తీర్చిదిద్దిన సూపర్ హీరోకి.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. #'ప్రాజెక్ట్-K' సెట్స్‌కు మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు మేము సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నాం. ఇందుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము'.. అని చిత్ర బృందం పేర్కొంది. దాంతో 'ప్రాజెక్ట్-K' లో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్నట్టు క్లారిటీ వచ్చింది.