హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కర్నాటకలోని ముడి ఇనుప ఖనిజం గని దోనిమలైకు సంబంధించి పెండింగ్లో ఉన్న వివాదాన్ని ఎన్ఎండీసీ పరిష్కరించుకుంది. 2018 నవంబరు నుంచి ఇక్కడ ఇనుప ఖనిజం తవ్వకం నిలిచిపోయిందని తాజాగా వివాదం పరిష్కరించుకోవటమే కాకుండా లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉక్కు కంపెనీలు ఇనుప ఖనిజం కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ గనిలో మళ్లీ ఉత్పత్తి ప్రారంభం కానుందని పేర్కొంది.