Abn logo
Aug 6 2020 @ 23:39PM

ప్రేమ కోసం ఏమైనా...

వంశీకృష్ణ ఆనంద్‌ కుమార్‌, వికాస్‌ చంద్ర హీరోలుగా, ఉష, రూపాలీ, ఏంజెల్‌ హీరోయిన్లుగా నిర్మితమైన  చిత్రం ‘ప్రియతమా’. ‘ఎనీథింగ్‌ ఫర్‌ లవ్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఆర్కే టాకీసు పతాకంపై కర్నూలుకు చెందిన పులకుర్తి కొండయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా గురించి ఆయన వివరిస్తూ ‘యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు తీయాలని తొలి ప్రయత్నంగా ‘ప్రియతమా’ సినిమా నిర్మించాను. మా సంస్థ నుండి సామాజిక సందేశాన్ని అందించే చిత్రాలతో పాటు పూర్తి స్థాయి కమర్షియల్‌ చిత్రాల్ని కూడా తీయాలన్నది నా సంకల్పం. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తాం’ అని తెలిపారు. చంద్రమోహన్‌, సుమన్‌శెట్టి, నర్సింగ్‌ యాదవ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఏ.కె. జంపన్న, సంగీతం: చైతన్య, ఛాయాగ్రహణం: ఆనెం వెంకట్‌, దర్శకత్వం: సంతోష్‌ పార్లవార్‌.

Advertisement
Advertisement
Advertisement