Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 11 2021 @ 15:27PM

UP Elections: ప్రియాంక గాంధీ 12వేల కి.మీ. ప్రతిజ్ఞయాత్ర

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా పెద్ద ఎత్తున యాత్ర చేపట్టనున్నారు. ‘‘కాంగ్రెస్ ప్రతిజ్ఞయాత్ర’’ అనే పేరుతో చేపడుతోన్న ఈ భారీ కార్యక్రమానికి ‘మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం’ అనే ట్యాగ్‌లైన్ తగిలించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 12,000 కిలో మీటర్ల మేర సాగనున్న ఈ యాత్రతో యూపీలో కాంగ్రెస్ బలాన్ని అంతకంతకూ పెంచుకోవాలని కాంగ్రెస్ ఊవిళ్లూరుతోంది.


ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటామని ఓటర్లకు గట్టి సందేశం ఇవ్వడానికి ఈ యాత్ర చేపట్టబోతున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావశంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం జోన్ల వారీగా ఈ యాత్ర కొనసాగనుందట. పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సహా మరికొంత మంది కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అనేక సమస్యలపై రిపోర్ట్ తయారు చేశారట. ఈ రిపోర్ట్‌ను అనుసరించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.

Advertisement
Advertisement