Abn logo
Sep 21 2020 @ 11:58AM

ఆస్కార్ బరిలో ప్రియాంక?

Kaakateeya

బాలీవుడ్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా మరో అరుదైన ఘనతను సాధించనుందా? గతంలో ఆస్కార్ వేడుకలకు అతిథిగా వెళ్లిన ప్రియాంక వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డునే ఇంటికి తీసుకురానుందా? అవుననే అంటున్నాయి హాలీవుడ్ వర్గాలు. వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్‌ వేడుకలో `ది వైట్‌ టైగర్` తరఫున ప్రియాంక నామినేట్ కాబోతోందని తెలుస్తోంది. 


`ది వైట్‌ టైగర్` తరఫున ఉత్తమ సహాయ నటి విభాగంలో ప్రియాంక చోటు దక్కించుకునే అవకాశం ఉందని టాక్‌. హాలీవుడ్‌ స్టార్స్‌ మెరిల్‌ స్ట్రీప్, నటాషా లయాన్, మారే విన్నింగ్‌హామ్ తదితర నటీమణులతో ప్రియాంక పోటీ పడనుందని సమాచారం. `ది వైట్‌ టైగర్` ఇంకా థియేటర్లలో విడుదల కాలేదు. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. మరి, ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను ప్రియాంక గెలుచుకుంటుందా? లేదా అనేది చూడాలి.


Advertisement
Advertisement
Advertisement