Aug 3 2021 @ 16:12PM

ధనుష్‌ సరసన సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ వరుస ప్రాజెక్టులకు కమిట్‌ అవుతున్నారు. ‘అసురన్‌’, ‘కర్ణన్‌’, ‘జగమే తందిరమ్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ధనుష్‌ ఇపుడు మారన్‌గా కనిపించనున్నారు. దీని తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన మిత్రన్‌ జవహర్‌ తెరకెక్కించే మూవీలో నటించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడికానుంది. అయితే, ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. వీరిలో ఒకరు రాశీఖన్నా కాగా.. మరొకరు ప్రియా భవానీ శంకర్‌. బుల్లితెర నుంచి బిగ్‌ స్ర్కీన్‌కు వచ్చిన ఈ భామ చేతిలో ఇపుడు దాదాపు పది ప్రాజెక్టుల వరకు ఉన్నాయి. వీటిలో ‘కచడపర’, ‘రుద్రన్‌’, ‘కురుదియాట్టం’, ‘హాస్టల్‌’, ‘పత్తుతల’, ‘బొమ్మై’ వంటి చిత్రాలున్నాయి. వీటితోపాటు ఇపుడు ధనుష్‌ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీత బాణీలు సమకూర్చకున్నారు.

Otherwoodsమరిన్ని...