Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెనక్కి తీసుకోవాలి: కనకమేడల

ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌ కార్మికులకు అండగా ఉంటామని ఎంపీలు కనకమేడల, గల్లా జయదేవ్‌ భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కార్మికులకు ఆందోళన చేస్తున్నారు. కార్మికుల ఆందోళనకు  టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్  మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కనకమేడల మాట్లాడుతూ విశాఖ స్టిల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లోపల, బయట విశాఖ స్టిల్ ప్లాంట్ అంశంపై పోరాడుతామని కనకమేడల ప్రకటించారు.


విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటాన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు ఢిల్లీకి తీసుకువెళ్లాయి. సోమ, మంగళవారం జంతర్‌మంతర్, ఏపీ భవన్ దగ్గర ఆందోళన చేయాలని సంఘాల నేతలు నిర్ణయించారు. ఈ ధర్నాలో పార్టీల ఎంపీలు, నేతలు కూడా పాల్గొంటారు. అయితే నిరసన ప్రదర్శన చేయడానికి వచ్చిన స్టీల్ ప్లాంట్ సిబ్బందిని ఢిల్లీ పోలీసులు అడ్డుకుంటున్నారు. న్యూ రైల్వే స్టేషన్‌లోనే రెండున్నర గంటలు నిర్బంధించారు. జంతర్ మంతర్‌కు ఆటోలో వెళుతున్నవారిని కూడా అడ్డుకున్నారు.

Advertisement
Advertisement