Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రకాశం : లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు..

ఒంగోలు : ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలం వెంకటాపురం దగ్గర హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా.. హైదరాబాద్‌ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement