Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడికి పెద్ద కథే ఉంది.. స్టూడెంట్ నెంబర్1 సినిమాలో NTR లాగా..

జూనియర్ ఎన్టీయార్ నటించిన `స్టూడెంట్ నెంబర్ 1` సినిమా చూశారా? ఆ సినిమాలో ఎన్టీయార్ ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళతాడు.. జైలు నుంచే కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు.. అచ్చం అలాగే ఓ యువకుడు తన సత్ప్రవర్తనతో అధికారులను ఆకట్టుకుని జైలు నుంచి బయటకు వచ్చి తనకు నచ్చిన పని చేస్తున్నాడు.. ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి జైలు నుంచి రోజూ బయటికి వెళ్లి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాడు.. 


రాజస్థాన్‌లోని అల్వార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుభాష్ తన సత్ప్రవర్తనతో జైలు అధికారులను ఆకట్టుకున్నాడు. దీంతో జైలు అధికారులు అతనికి పగటి పూట బయటకు వెళ్లే అవకాశం కల్పించారు. సుభాష్ రోజూ మధ్యాహ్నం బయటకు వచ్చి అల్వార్‌లోని పవర్ హౌస్ జంక్షన్‌లో ఓ ఎన్జీవో సంస్థ పేదల కోసం ఏర్పాటు చేసిన ఆహారాన్ని వడ్డిస్తుంటాడు. అనంతరం సాయంత్రానికి జైలుకు తిరిగి వెళ్లిపోతుంటాడు. పేదలకు అన్నం వడిస్తుంటే చాలా సంతోషంగా ఉందని సుభాష్ చెబుతున్నాడు. 


ఇవి కూడా చదవండి

పరువు పోతోంది.. పద్ధతి మార్చుకోమన్న భర్త.. పెట్రోల్ పోసి నిప్పంటించినా చావకపోవడంతో ప్రియుడితో కలిసి ఆ భార్య..
నిద్రమత్తులో బ్రష్‌పై పేస్ట్ పెట్టుకున్న యువతి.. తీరా బ్రష్ చేశాక చూస్తే.. విషాదం!

అల్వార్‌కు సమీపంలోని షాపూర్ గ్రామానికి చెందిన సుభాష్ పదేళ్ల క్రితం ఓ దాబా వద్ద కొందరు వ్యక్తులతో గొడవపడ్డాడు. ఆ గొడవలో క్షణికావేశంలో ఇద్దరిని చంపేశాడు. ఈ కేసులో సుభాష్‌కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. క్షణికావేశంలో జరిగిన తప్పును గుర్తించిన సుభాష్ తన ప్రవర్తనను మార్చుకున్నాడు. మంచిగా మెలుగుతూ జైలు అధికారుల ఆదరణను చూరగొన్నాడు. దీంతో సుభాష్‌కు రెండు నెలల క్రితం అధికారులు జైలు నుంచి బయటకు వెళ్లి వచ్చే అవకాశం కల్పించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement