Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనకాపల్లిలో పరిశుభ్రతకు ప్రాధాన్యం

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌


అనకాపల్లి, నవంబరు 30: అనకాపల్లిలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గుడివా అమర్‌నాథ్‌ చెప్పారు. జోనల్‌ కార్యాలయంలో ప్రభుత్వం పంపిణీ చేసిన తడి-పొడి చెత్త సేకరణ వాహనాలను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని 27 సచివాలయాలకు 27 వాహనాలను ప్రభుత్వం అందజేసిందన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని తడి-పొడి చెత్తను వేర్వేరుగా వాహనాలకు అందజేయలన్నారు. కార్యక్రమంలో స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు మందపాటి  సునీత, కార్పొరేటర్లు జాజుల లక్ష్మిప్రసన్న, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నాయకులు మందపాటి జానకిరామరాజు, బొడ్డేడ శివ, పలకా రవి, జాజుల రమేశ్‌ కొణతాల భాస్కరరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement