Abn logo
Jun 4 2020 @ 04:49AM

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోండి

కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 3: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకో వాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. బుధవారం మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ విధానమే కారణమని, పార్టీ నాయకులు ఇసు కను ఇతర రాష్ట్రాలకు  అక్రమంగా రవాణా చేస్తూ రూ.లక్షలు కొల్లగొడు తున్నారని ఎంపీలు, ఎమ్మెల్యేలే చెబుతున్నారని ఆరోపించారు.  ఈ ప్రభు త్వంలో జరిగినంత ఇసుక దోపిడీ ఎప్పుడూ జరగలేదని అన్నారు. గత ప్రభుత్వం కేవలం రూ.1600కే ట్రాక్టరు ఇసుకను అందించిందని, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచేశారని అన్నారు. 


సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించడాన్ని స్వాగతిస్తున్నామని సోమిశెట్టి అన్నారు. సీఎం  జగన్‌ నిర్ణయాన్ని కోర్టులు తప్పుపడుతున్నాయని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చర్యలు తీసుకోవడమే కారణమ న్నారు. కార్యక్రమంలో పోతుల రవికుమార్‌, జేమ్స్‌, బజారప్ప, నాగేంద్రకుమార్‌, హరినాథ్‌, చిన్నమారెన్న, బజారన్న, దీనేష్‌, ఈశ్వరరావు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement