Abn logo
Oct 12 2020 @ 03:55AM

అందజేస్తున్న అసోసియేషన్‌ నిర్వాహకులు

Kaakateeya

బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వహణకు

గడువు పొడిగించాలి


ఘట్‌కేసర్‌: కొవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా 194 రోజుల పాటు బార్లు, రెస్టారెంట్లు మూసి వేశామని, నిర్వహణకు గడువు పొడిగించాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ను బార్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ నిర్వాహకులు  విజ్ఞప్తి చేశారు. నగరంలోని రవీంద్రభారతి సమీపంలోని మంత్రి కార్యాలయంలో ఆదివారం బార్‌ అండ్‌ రెస్టారెంట్ల అసోసియేషన్‌ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నాయకులు  సారా శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో 194 రోజులు బార్లు మూసి ఉంచడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని తెలిపారు.  భవనాల అద్దెలు, ప్రభుత్వానికి పన్నులు చెల్లించడానికి పెద్దఎత్తున అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని వాపోయారు. స్పందించిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

Advertisement
Advertisement