Abn logo
Sep 22 2021 @ 01:02AM

సీనియారిటీ జాబితా సిద్ధం చేయండి: డీఈవో

సమావేశంలో ప్రసంగిస్తున్న పురుషోత్తం

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 21: టీచర్ల సీనియారిటీ జాబితా సిద్ధం చేయాలని డీఈవో పురుషోత్తం ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం తన చాంబర్‌లో వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బందితో సమీక్షించారు. కేడర్లవారీగా హెచ్‌ఎంలు, ఎస్‌ఏలు, ఎస్జీటీలు, ఇతర విభాగాలకు చెందిన వారి సీనియారిటీ జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఏయే విభాగాల్లో ఖాళీలున్నాయో గుర్తించాలన్నారు. సమావేశంలో ఏడీ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్లు, బాబు, సురేష్‌, కృపావతి, సిబ్బంది పాల్గొన్నారు. కాగా.. స్కూల్‌ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఈనెల 25లోపు డీఈవో కార్యాలయంలో తెలియజేయొచ్చు.