Abn logo
Sep 21 2020 @ 03:10AM

అమ్మాయిల క్రికెట్‌కు సిద్ధం

ఇంగ్లండ్‌-విండీస్‌ తొలి టీ20 నేడు


డెర్బీ (ఇంగ్లండ్‌): కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలలకుపైగా ఆగిన మహిళల క్రికెట్‌ మళ్లీ మొదలుకానుంది. పురుషుల తరహాలోనే మహిళల క్రికెట్‌ కూడా ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య సిరీ్‌సతోనే పునఃప్రారంభమవుతోంది. ఇంగ్లండ్‌ పర్యటనలో వెస్టిండీస్‌ మహిళల జట్టు మొత్తం ఐదు టీ20లు ఆడనుంది. సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లూ డెర్బీ వేదికగానే జరుగనున్నాయి. తొలి మ్యాచ్‌ సోమవారం జరగనుంది. గత మార్చి 8న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాత మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి. 

Advertisement
Advertisement
Advertisement