Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాధులపై ముందస్తు చర్యలు తీసుకోవాలి

పోరుమామిళ్ల, నవంబరు 27: దోమల వలన వచ్చే వ్యాధులు వాటి నివారణకు ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి హుసేన మ్మ సూచించారు. శనివారం వైద్యవిధాన పరిషత్‌లో ఫీల్డ్‌స్టాఫ్‌, సూపర్‌వైజర్స్‌, ఆశ కార్యకర్తలకు ని ర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడుతూ దోమల వ్యాప్తిని, వాటితో వచ్చే మలేరియా, డెంగ్యూ, గున్యా వ్యాధులను నివారించవచ్చన్నారు. ప్రజలు అందరూ దోమతెరలు వాడాలన్నారు. టేకూరుపేట, కలసపాడు, నర్సాపురం, పలుగురాళ్లపల్లె ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల మెడికల్‌ ఆఫీసర్లు చెన ్నకేశవ, ఆశ్వినీ, శ్వేత, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సాధువెంకటేశ్వర్లు, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. 

లింగాలలో అబేడ్‌ పిచికారీ...

లింగాల, నవంబరు 27: డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మ లేరియా సబ్‌యూనిట్‌ అధికారి సిద్దయ్య ప్రజలకు సూ చించారు. లింగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇంటి ఓబయ్యపల్లెలో ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించారు. నిల్వలున్న నీటిలో, నీటితొట్లలో అబేడ్‌ పిచికారీ చేసి, మలేరియా, డెంగ్యూ వ్యాధుల పై అవగాహన కోసం కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించుకోవాలన్నారు. ప్రతి శుక్ర వారం ప్రజలు తప్పనిసరిగా డ్రైడే పాటించాలన్నా రు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు భాస్కర్‌ నారాయ ణమ్మ, ఆశాకార్యకర్త అరుణ తదితరులు  పాల్గొన్నారు.

Advertisement
Advertisement