Abn logo
May 30 2020 @ 13:32PM

ఎన్టీఆర్ కోసం అదే ఫార్ములా ఉప‌యోగించ‌నున్న ప్ర‌శాంత్ నీల్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాను పూర్తి చేసిన త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకుండా మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ పీరియాడిక‌ల్ నేప‌థ్యంలో తార‌క్ సినిమాను తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్న‌ట్లు టాక్‌. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న ‘కె.జి.య‌ఫ్’ చిత్రం కూడా పీరియాడిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాలోనే తార‌క్ సినిమాను చేయాల‌నుకుంటున్నట్లు తెలిసింది. 

Advertisement
Advertisement
Advertisement