Advertisement
Advertisement
Abn logo
Advertisement

దర్శి TDP ఆఫీస్‌ వద్ద సందడి వాతావరణం

ఒంగోలు: ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.  నగర పంచాయతీలో గెలుపొందిన వార్డు కౌన్సిలర్లు టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. గెలుపొందిన వార్డు కౌన్సిలర్లను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, దర్శి ఇంచార్జ్ పమిడి రమేష్ అభినందించారు. దర్శి నగర పంచాయతీ కైవసంతో టీడీపీ శ్రేణులు నూతనోత్తేజంలో ఉన్నారు.  దర్శి నగర పంచాయతీకి ఎన్నికలు తొలిసారి జరిగాయి. చైర్మన్‌గా నారపుశెట్టి పిచ్చయ్య పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. 

Advertisement
Advertisement