Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఒంగోలు: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం  వెంకటాపురం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని  శ్రీ కృష్ణ ట్రావెల్స్‌కు చెందిన  బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement