Advertisement
Advertisement
Abn logo
Advertisement

Prakasam జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల సందడి

ఒంగోలు: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం మొదటి సోమవారంతో పాటు నాగులచవితి పండుగను పురస్కరించుకుని శైవక్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. శివ నామస్మరణలతో శివాలయాలు మారుమ్రోగుతున్నాయి. ఒంగోలు, చీరాలలోని పలు శైవాలయాలకు తెల్లవారుజాము నుండే  భక్తులు బారులు తీరారు. ఒంగోలు రంగరాయుడు చెరువు సమీపంలో ఉన్న పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. బిల్వాదళాలతో, పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కార్తిక దీపాలతో ఆలయ ప్రాంగణాలు శోభయామనంగా ఉన్నాయి. దేవాలయాలను అర్చకులు సుందరంగా తీర్చిద్దారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement