May 14 2021 @ 09:56AM

ప్రభాస్‌తో హాలీవుడ్ హీరోయిన్‌..!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో హాలీవుడ్ బ్యూటీ న‌టించ‌నుందా? అవున‌నే స‌మాధానం నెట్టింట వినిపిస్తోంది. ఇంత‌కీ ఏ సినిమాలో అనే సందేహం రాక మాన‌దు. వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టిస్తాడ‌నే టాక్ వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో హాలీవుడ్ బ్యూటీని న‌టింప చేయాల‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది. అంతా ఓకే అయితే 2022 ద్వితీయార్థంలో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందట. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ‘రాధేశ్యామ్’ విడుదలకు సన్నద్ధమవుతుంది. మరో వైపు ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కావాల్సి ఉంది.