ప్రభాస్‌ను బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియాగా పిలవగా.. అతడిచ్చిన సమాధానమిదే..

ప్రభాస్ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో‌ను సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దీంతో అతడు నటించే సినిమాలన్ని వివిధ భాషల్లోను తెరకెక్కుతున్నాయి. బాహుబలి-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్లకు పైగా వసూలు చేయడంతో కొంతమంది అతడిని బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియాగా పిలవడం మొదలుపెట్టారు. అలా పిలవడంపై మీ స్పందన ఏంటీ అడగగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ సమాధానమిచ్చాడు. 


ప్రభాస్‌ని బిగ్గెస్ట్ ఆఫ్ ఇండియాగా బాహుబలి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సెంథిల్ కుమార్ పిలిచాడు. బాలీవుడ్ నటులైన షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను అతడు మించిపోయాడాని చెప్పాడు. బాహుబలికి ప్రొడక్షనర్ డిజైనర్‌గా పనిచేసిన సాబు సిరిల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘‘ ఇండియాలో అతిపెద్ద స్టార్ ప్రభాస్. బాలీవుడ్‌లో ఉన్న అందరి ఖాన్‌ల కంటె కూడా అతడే గొప్పవాడు. రూ.1000కోట్లకు పైగా ఇంతవరకు ఏ చిత్రం వసూలు చేయలేదు. కానీ, అతడు హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా మాత్రం అంత డబ్బును వసూలు చేసింది. ఈ మూవీకి పని చేసినందుకు నాకు ఎంతగానో గర్వంగా ఉంది ’’ అని సాబు సిరిల్ అన్నాడు.


బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియాగా కొంత మంది మిమ్మల్ని పిలుస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటీ అడగగా ప్రభాస్ జవాబిచ్చాడు. ‘‘ సెంథిల్‌కు ఉత్సాహం కొంచెం ఎక్కువైంది. దీంతో అతడు బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియాగా పిలిచాడు. బాహుబలి సాధించినన్ని వసూలు ఇంతవరకు ఏ చిత్రం వసూలు చేయలేదు. అతడు అత్యుత్సాహంతో ఆ మాటలను అన్నాడు. వాటిని పట్టించుకోనవసరం లేదు ’’ అని ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

Advertisement