Abn logo
Mar 25 2020 @ 21:15PM

శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ఇష్ట‌మైన హీరో ఎవ‌రో తెలుసా?

‘బాహుబ‌లి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్‌కు ఇమేజ్ ఓ రేంజ్‌లో పెరిగింది. ప్రభాస్‌కున్న అభిమానుల్లో ప్ర‌స్తుత యంగ్ క్రికెట‌ర్ శ్రేయ‌స్ అయ్యర్ ఒక‌డు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న అభిమానుల‌తో చాట్ చేస్తున్న సంద‌ర్భంలో మీకు ఇష్ట‌మైన సౌతిండియ‌న్ స్టార్ ఎవ‌రు? అని అడిగితే.. నా ఫేవ‌రేట్ ప్ర‌భాస్ అని శ్రేయాస్ అయ్య‌ర్ తెలిపాడు. ప్ర‌స్తుతం శేయ్రాస్ అయ్య‌ర్ ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌లో కీల‌క ఆట‌గాడిగా మారారు. ఢిల్లీ ఐపీఎల్ టీమ్ డేర్ డెవిల్స్‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ ప్ర‌స్తుతం కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement