Abn logo
Mar 31 2020 @ 13:20PM

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో ప్ర‌భాస్ 20..!

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. పీరియాడికల్ లవ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో లాక్‌డౌన్ కంటే ముందుగానే చిత్ర యూనిట్ జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైద‌రాబాద్ చేరుకుంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా వచ్చిన ఈ గ్యాప్‌ను చిత్ర యూనిట్ వృథా చేయడం లేద‌ట‌. ఈ గ్యాప్‌లో సినిమా పూర్త‌యిన మేర‌కు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రానికి ‘ఓ మై డియ‌ర్‌’, ‘రాధేశ్యామ్’ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ట‌.

Advertisement
Advertisement
Advertisement