Abn logo
Nov 30 2020 @ 05:16AM

పవర్‌ తగ్గని టైసన్‌ పంచ్‌!

రాయ్‌తో చారిటీ మ్యాచ్‌ డ్రా

లాస్‌ ఏంజిల్స్‌: వయసు మీదపడినా తన పంచ్‌ పవర్‌ తగ్గలేదని మాజీ హెవీ వెయిట్‌ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ నిరూపించాడు. కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన 15 ఏళ్ల తర్వాత రింగ్‌లోకి దిగినా మునుపటి జోరునే ప్రదర్శించాడు. ఫోర్‌ డివిజన్‌ మాజీ చాంపియన్‌ రాయ్‌ జోన్స్‌ జూనియర్‌తో ఆదివారం జరిగిన ఎగ్జిబిషన్‌ బౌట్‌లో 54 ఏళ్ల టైసన్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు నిమిషాల చొప్పన ఎనిమిది రౌండ్లపాటు జరిగిన బౌట్‌లో 51 ఏళ్ల రాయ్‌పై టైసన్‌ పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి శరీరంపైనా, తలపైనా పిడిగుద్దులు కురిపించాడు. అయితే, ఈ బౌట్‌ డ్రాగా ముగిసినట్టు వరల్డ్‌ బాక్సింగ్‌ మండలి (డబ్ల్యూబీసీ) జడ్జీలు ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన నియమాల ప్రకారం ఈ బౌట్‌లో నాకౌట్‌లు లేవు.. విజేతలు ఉండరు. ఎవరికైనా గాయమైతే పోటీని నిలిపివేయాలి.

Advertisement
Advertisement
Advertisement