Sep 16 2021 @ 10:36AM

షారుఖ్, అట్లీ మూవీకి పవర్ ఫుల్ టైటిల్..!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ మూవీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఒకటి పెట్టబోతున్నట్టు తాజా వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల మొదలైన షారుఖ్, అట్లీ మూవీ శరవేగంగా షూటింగ్ సాగుతోంది. నయనతార, ప్రియమణి హీరోయిన్స్‌గా ఇందులో నటిస్తున్నారు. కాగా దీనికి "లయన్" అనే పవర్ ఫుల్ టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నారట. త్వరలో దీనిని అఫీషియల్‌గాను అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇక ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

Bollywoodమరిన్ని...