Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి బాలినేని ఇంటి దగ్గర విద్యుత్ ఉద్యోగుల ధర్నా

విజయవాడ: మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్యుత్ మీటర్ రీడర్లను తొలగించొద్దని డిమాండ్ చేశారు. మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదంటూ ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడ్రోజులుగా ధర్నా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. పాదయాత్రలో చేసిన హామీని సీఎం నిలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. సమస్యల పరిష్కారానికి మంత్రి బాలినేని హామీ ఇవ్వాలంటూ ఉద్యోగులు ఆందోళన చేశారు. Advertisement
Advertisement