Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయసాయికి తెలిసే పోస్కోతో ఒప్పందం: సబ్బం హరి

అమరావతి: ఎంపీ విజయసాయిరెడ్డికి తెలిసే పోస్కోతో ఒప్పందం చేసుకున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోపించారు. ఏబీఎన్ డిబేట్‌లో సబ్బం హరి మాట్లాడుతూ సీఎం జగన్ కనుసన్నల్లోనే అంతా జరిగిందన్నారు. పోస్కో వాళ్లు ఇక్కడికొచ్చి ఏమైనా చేయాలనుకుంటే అది భ్రమేనని చెప్పారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. విశాఖలో వైసీపీ గెలిస్తే ప్రజలు నరకం చూడాల్సి వస్తుందని సబ్బం హరి హెచ్చరించారు. స్థానికేతరులను గెలిపిస్తే ప్రమాదమని విశాఖ ప్రజలు గుర్తించాలన్నారు. వైసీపీ గెలిస్తే విశాఖ వందేళ్ల చరిత్ర నాశనం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తెను గెలిపించుకునేందుకు పోలీసులను ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. బెదిరింపులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని తెలిపారు.


‘‘వార్డుకు రూ.కోటి, 2 కోట్లు ఖర్చు పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. వైసీపీ దృష్టిలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం లేదు. విశాఖ ప్రజలు వైసీపీ డైనామాలో పడుతున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో జనసేనాని పవన్ బలం పెరిగింది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది’’ అని సబ్బం హరి తెలిపారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement