Abn logo
Aug 3 2021 @ 22:13PM

సమస్యలపై పోరాటానికి సిద్ధం కండి : కురుగొండ్ల

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

 

వెంకటగిరి, ఆగస్టు 3: గ్రామస్థాయిలో సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన నివాసంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏమండలానికి ఆ మండలంలో సమావేశాలు నిర్వహించి, అక్కడి సమస్యలపై చర్చించి వాటిని కలెక్టర్‌, ఎస్పీల దృష్టికి తీసుకుపోనున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒక్క అభివృద్ధి జరగక పోగా, ఉన్న పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు తరలి వెళుతున్నాయని ఆరోపించారు. చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించక పోవడంతో పలువురు అవస్థలు పడుతున్నట్లు  తెలిపారు. చేసిన పనపులకు బిల్లులు చెల్లించేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో నాయకులు పోలంరెడ్డి వెంకటరెడ్డి, పులికొల్లు రాజేశ్వరావు, శ్రీరామదాసు గంగాదరం, కేవీకే ప్రసాద్‌ నాయుడు, మోహన్‌కృష్ణారెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.