Aug 3 2021 @ 10:43AM

ప్రముఖ గాయని కళ్యాణి మీనన్ మృతి

ప్రముఖ నేపథ్య గాయని, సినిమాటోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ తల్లి, కళ్యాణి మీనన్ మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయసు 80ఏళ్ల. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన కళ్యాణి మీనన్ 1990, 2000ల సంవత్సరాలలో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో తమిళం, మలయాళంలో 100కి పైగా సినిమా పాటలు పాడారు. వాటిలో ఎక్కువ పాటలు ఏఆర్ రెహమాన్ సినిమాలకి పాడటం విశేషం. ముఖ్యంగా 'కాదలన్', 'ముత్తు', 'ఏక్ దీవానా థా' లాంటి చిత్రాలలో ఆమె పాడిన పాటలకి ఎంతో క్రేజ్ వచ్చింది. గతకొన్నిరోజులుగా ఆమె పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. కళ్యాణి మీనన్ మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్6తో పాటు.. తమిళ, మళయాళ చిత్ర పరిశ్రమ నివాళుర్పిస్తోంది.  

Otherwoodsమరిన్ని...