Abn logo
Apr 2 2020 @ 09:46AM

జార్జియాలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం: పూజా హెగ్డే

తెలుగులో అగ్ర హీరోలందరి సరసనా అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది పూజా హెగ్డే. డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో పూజ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం జార్జియాలో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. 


కరోనా వ్యాప్తి ప్రారంభమవుతున్న దశలో చిత్రబృందం జార్జియా పయనమైంది. అప్పటి అనుభవాలను పూజ తాజాగా పంచుకుంది. `జార్జియాకు వెళ్లే ముందు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అక్కడ షూటింగ్ సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాం. జార్జియా నుంచి భారత్‌కు రాగానే ఎవరినీ కలవకుండా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయా. లాక్‌డౌన్‌కు ముందే భారత్‌కు తిరిగి వచ్చేయడం మా అదృష్టం. లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్లం` అంటూ పూజ తెలిపింది. 

Advertisement
Advertisement
Advertisement