Abn logo
Apr 2 2020 @ 08:38AM

అగ్ర హీరోపై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా వైరస్ కారణంగా సామాన్య ప్రజలు మొదలుకొని  ప్రముఖులంతా ఇళ్లకే పరిమితమై ఉంటున్నారు. కొందరు ఇంటి పనులలో బిజీగా ఉంటుండగా, మరికొందరు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొందరు తారలు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చట్లు సాగిస్తున్నారు. "అల వైకుంఠ పురములో" హీరోయిన్ పూజా హెగ్డే  సోషల్ మీడియా మాధ్యమంలో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక అభిమాని... మీరు షారుఖ్ ఖాన్ గురించి ఏమనుకుంటున్నారు? అని అడగగా పూజా దానికి సమాధానంగా... షారూక్ కింగ్ అఫ్ రొమాన్స్ అని తెలిపారు. అలాగే మీ అభిమాన గాయకుడు ఎవరని అని మరొక యూజర్ అడగగా... ఎఆర్ రెహమాన్ అని సమాధానం ఇచ్చారు. 

Advertisement
Advertisement
Advertisement