Abn logo
Mar 30 2020 @ 16:10PM

పూజ అక్కడ కూడా సత్తా చాటుతుందా?

తెలుగునాట గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది పూజా హెగ్డే. వరుస విజయాలు అందుకుంటూ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో నటిస్తోంది. 


తాజాగా కోలీవుడ్ నుంచి కూడా పూజకు ఛాన్స్ వచ్చిందట. తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో నటించే ఛాన్స్ పూజను వరించిందట.  సూర్య హీరోగా డైరెక్టర్ హరి `అరువ` అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజను ఖరారు చేసినట్టు సమాచారం. సూర్య, హరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన `సింగం` సిరీస్ సినిమాలు ఘనవిజయాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. సూర్య సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం ద్వారా కోలీవుడ్‌లో కూడా పాగా వేయాలని పూజ భావిస్తోందట. 

Advertisement
Advertisement
Advertisement