Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్‌కు రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదు: పొన్నాల

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. సీఎంకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోదీ ఇంటి వద్ద ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. ఆయనకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం తెలంగాణకు అవమానమన్నారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం అర్రలో నుంచి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. తాడో పేడో తేల్చుకుంటానని మాట్లాడిన ఆయన ఢిల్లీలో ఏం జరిగిందో ఎందుకు చెప్పలేదని పొన్నాల నిలదీశారు.

Advertisement
Advertisement