Abn logo
Oct 20 2021 @ 22:54PM

సమాజ సేవలో పోలీసులు ముందుండాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

-ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి, అక్టోబరు 20 : పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సమాజ సేవలో ముందుండాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని పద్మశాలి భవన్‌లో బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్‌ ఆధ్వర్యంలో సబ్‌ డివిజన్‌ పరిధిలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఏసీపీ ఎడ్ల మహేష్‌, సీఐలు ముస్కె రాజు, జగదీష్‌, కోట బాబురావులతో పాటు ఎస్‌ఐలు, పోలీసులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం కళ్యాణిభీమాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.