Abn logo
Oct 22 2020 @ 00:47AM

పోలీస్‌ అమరుల కుటుంబాలకు అండగా ఉండాలి

ఆమనగల్లు/యాచారం/షాబాద్‌/మహేశ్వరం/షాద్‌నగర్‌ రూరల్‌/శంషాబాద్‌ : పోలీస్‌ అమరవీరుల స్ఫూర్తితో విధి నిర్వహణకు పునరంకితం కావాలని  పోలీస్‌ అధికారులు పిలుపునిచ్చారు. జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని బుధవారం పలుచోట్ల నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోలీసు అధికారులు, నాయకులు పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రజలంతా అండగా నిలిచి వారికి మనోధైర్యం కల్పించాలని కోరారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గల దివంగత ఎస్‌ఐ కాసం హన్మంత్‌రెడ్డి విగ్రహానికి సీఐ కే.నర్సింహారెడ్డి, ఎస్‌ఐ ధర్మేశ్‌, పోలీసు సిబ్బంది పలువురు నాయకులు పాల్గొని పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు. అమర వీరుల సేవలను స్మరించుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రజా రక్షణ, కర్తవ్య నిర్వహణలో ప్రాణాలొడ్డిన పోలీసు అమరవీరుల సేవలను ప్రజలు ఎప్పటికీ మరువద్దని అన్నారు.  కార్యక్రమంలో ఏఎ్‌సఐ నిరంజన్‌, నాయకులు రాఘవేందర్‌, కృష్ణనాయక్‌, ఖాదర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా తలకొండపల్లి పోలీసు స్టేషన్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన నయీమొద్దీన్‌, అమరవీరుల చిత్ర పటాలకు ఎస్‌ఐ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.


ఈ కార్యక్రమంలో ఏఎ్‌్‌సఐలు ప్రసాద్‌, నర్సింగ్‌శెట్టి, హెచ్‌సీలు రామ్‌లాల్‌, గోపాల్‌, రవీందర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. యాచారం మండల కేంద్రంలో సీఐ లింగయ్య ఆధ్వర్యంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసు అమరవీరులకు నివాళ్లర్పిం చారు. షాబాద్‌ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీఆర్‌ఆర్‌ మినీ స్టేడియంలో క్రికెట్‌, వాలీబాల్‌ పోటీల్లో గెలుపొందిన వారికి చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, షాబాద్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ బహుమతులను అందజేశారు. మహేశ్వరం పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ కార్యక్రమంలో సీఐ మధుసూదన్‌, ఎస్సైలు శ్రీనివా్‌సరెడ్డి, వెంకటయ్య, నాగార్జున, పోలీసు సిబ్బంది పలువురు నాయకులు పాల్గొన్నారు. షాద్‌నగర్‌ పట్టణంలో రాత్రి ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌కుమార్‌ నేతృత్వంలో పోలీస్‌ స్టేషన్‌ నుంచి ప్రధాన కూడలి వరకు పోలీసులు, నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సైలు విజయభాస్కర్‌, సురేష్‌ యాదవ్‌, కౌన్సిలర్‌ సర్వర్‌పాషా, లక్ష్మణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్‌లో  ఎయిర్‌పోర్టు పోలీసులు అంబేద్కర్‌ చౌరస్తా నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమర వీరుల పేర్లను స్మరిస్తూ నినాదాలు చేశారు.

Advertisement
Advertisement