Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్టేట్ బ్యాంక్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

కృష్ణా: జిల్లాలోని  తోట్లవల్లూరు మండలంలో గల పెనమకుర్రులోని స్టేట్ బ్యాంక్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఫిర్యాదు చేసిన అయిదు గంటల్లోనే కేసుని పోలీసులు ఛేదించారని డీసీపీ కైలె విజయ్ పాల్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం నిందితుడి వద్ద నుంచి చోరీ అయిన 21,175 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విజయ్ పాల్ పేర్కొన్నారు. నిందితుడిపై  గతంలో దేవాలయాలు, బడ్డీ కొట్లలో చోరీలపై నాలుగు కేసులు నమోదయ్యాయని డీసీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించిన సిబ్బందిని డీసీపీ కైలె విజయ్ పాల్ అభినందించారు.  


Advertisement
Advertisement