Abn logo
Apr 22 2021 @ 05:12AM

ప్రభుత్వ అసమర్థతకు మచ్చుతునక పోలవరం: తులసిరెడ్డి

వేంపల్లె, ఏప్రిల్‌ 21: ‘‘రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు పోలవరం మచ్చుతునకగా మారింది. వరప్రసాదిని అయిన పోలవరం ప్రాజెక్టు శాపంగా, భారంగా మారడం శోచనీయం. గ్రావిటీ ప్రాజెక్టు కాస్త ఎత్తిపోతల ప్రాజెక్టుగా మారబోతోంది’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.   బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన పోలవరం జగన్‌ ప్రభుత్వ అసమర్థత కారణంగా ఒక చిన్న రిజర్వాయరుగా మారబోతుండడం దురదృష్టకరమని వివరించారు. లక్ష రూపాయలపైన పంట రుణాలు తీసుకున్న రైతులకు సున్నా వడ్డీ పథకం, పావలా వడ్డీ పథకం...  వర్తించడం లేదన్నారు. పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అందకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement