Abn logo
Oct 15 2021 @ 00:05AM

మహాలక్ష్మి ఆలయంలో కవిత పూజలు


నిజామాబాద్‌ రూరల్‌, అక్టోబరు 14:
రూరల్‌ మండలం పాల్దా గ్రామంలోని మహాలక్ష్మి మందిరంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం పాల్దా మహాలక్ష్మి అమ్మవారిని కవిత దర్శించుకున్నారు. ఆమె పేరిట ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కవిత ఆకుల కొండూరు, పాల్దా గ్రామాల్లో నిర్మించిన చెక్‌ డ్యామ్‌లను పరిశీలించారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో సెల్ఫీలు దిగారు. కవిత వెంట నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, జడ్పీచైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌, ఎంపీపీ అనూష, నిజామాబాద్‌ జడ్పీటీసీ సుమలత, ఇందల్‌వాయి జడ్పీటీసీ గడ్డం సుమనారెడ్డి, సర్పంచ్‌అశోక్‌, నుడా డైరెక్టర్‌ ముష్క సంతోష్‌, తదితరులున్నారు.
అష్టాదశ శక్తీపీఠాల దేవిమండపాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ
నిజామాబాద్‌అర్బన్‌, అక్టోబరు 14:  నగరంలోని చంద్రశేఖర్‌ కాలనిలో సాయి వెంకట రమణి యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అష్టాదశ శక్తిపీఠాల దేవి మండపాన్ని ఎమ్మెల్సీ కవిత గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత కోరుకున్నారు. ఆమె వెంట మేయర్‌ దండు నీతూకిరణ్‌, తదితరులు ఉన్నారు.