Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

రేపు అధికారికంగా ప్రకటించనున్న అధికారులు

ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబరాలు

ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న కల్వకుంట్ల కవిత

స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ్

నిజామాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 26న అధికారిక ప్రకటన వెలువడనుంది. బుధవారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనలో స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరింపబడింది. దీంతో కవిత ఒక్కరే పోటీలో ఉండడంతో ఏకగ్రీవం కానున్నారు.

ఫ రెండు నామినేషన్లు..

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు నామినేషన్లే దాఖలయ్యాయి. ఈ రెండు కూడా చివరి రోజు మంగళవారం నామినేషన్లను వేశారు. టీఆర్‌ఎస్‌ తరఫున సిటింగ్‌ ఎమ్మెల్సీ కవిత, స్వతంత్ర అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్‌ నామినేషన్లు వేశారు. దీంతో బుధవారం జిల్లా ఎన్నికల పరిశీలకులు అనితరాజేంద్రన్‌ సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రమిశ్ర, చంద్రశేఖర్లు పరిశీలించారు. ఎమ్మెల్సీ కవిత నామినేషన్‌ పత్రాలు అన్ని ఉండడంతో అధికారులు ఒకే చేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన శ్రీనివాస్‌  అఫిడవిట్‌ను సక్రమంగా సమర్పించకపోగా కొన్ని వివరాలను ఇవ్వకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. నామినేషన్‌ వేసిన ప్రతి ఒక్కరూ నోటరీ ద్వారా అఫిడవిట్‌ను సమర్పించాలి. ఎన్నికల పత్రాల్లో వివరాలు అన్ని ఇవ్వాలి. ఫారం 26లో ఈ వివరాలు ఇవ్వకపోవడం తెల్లకాగితం మీద నోటరీకి బదులు రాసి ఇవ్వడంతో రిటర్నింగ్‌ అధికారి నోటీసులు ఇచ్చారు. వివరాలను అందించాలని కోరారు. స్వతంత్ర అభ్యర్థి సకాలంలో అందించక పోవడం వల్ల తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. అయితే నామినేషన్‌ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ముగ్గురు బలపర్చిన వారు ఫిర్యాదు చేశారు. అయినా అఫిడవిట్‌లో వివరాలు సక్రమంగా లేక పోవడం వల్లనే తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. కాగా, తాను ఎవరి సంతకాలు ఫోర్జరీ చేయలేదని వారు అన్ని వివరాలు ఫొటోలు ఇచ్చిన తర్వాతనే నామినేషన్‌ వేసినట్లు స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ తెలిపారు.

ఫ ఉమ్మడి జిల్లాలో సంబరాలు..

ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నందున ఉమ్మడి జిల్లాలో పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. నగరంలోని అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా ఇంటి ఎదుట జరిగిన సంబురాల్లో మంత్రి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. అలాగే ఆయా మండలాల పరిధిలో సంబరాలను నిర్వహించారు. బాణసంచా పేల్చారు. పోటీ లేకుండా ఎన్నిక కావడంతో పార్టీ నేతల్లో మరింత ఉత్సాహం పెరిగింది. రానున్న రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఆమె ఆధ్వర్యంలో పార్టీ క్యాడర్‌ మరింత జోష్‌గా పనిచేసే అవకాశం ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో ఆమె చేసిన కృషి వల్ల ఏడు స్థానాలు అధికార పార్టీ గెలుచుకుంది. అదే రీతిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అవకాశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. 

ఫకవితకు పదవిపైన చర్చలు..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో దఫా కవిత ఎన్నిక కావడంతో ఆమెకు మంత్రి పదవి లేదా? అదే హోదా కలిగిన మరో పదవి వస్తుందని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గత ఉప ఎన్నికల్లో గెలిచిన సమయంలోనే పదవి వస్తుందని భావించిన అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డట్లు వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నిక కావడం ఆరేళ్ల పాటు ఆమె పదవిలో ఎమ్మెల్సీగా ఉండడం వల్ల ఈ దఫా మంత్రి పదవిగాని అదే హోదా పదవి వస్తే ఉమ్మడి జిల్లాలో మరింత జోష్‌గా పనిచేసే అవకాశం ఉంటుం దని వారు భావిస్తున్నారు.

Advertisement
Advertisement