Abn logo
Aug 2 2021 @ 00:07AM

పోడూరు సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షురాలిగా ఉషారాణి

ఉషారాణి

పోడూరు, ఆగస్టు 1 : పోడూరు మండల సర్పంచ్‌ల చాం బర్‌ అధ్యక్షురాలిగా తూర్పుపాలెం సర్పంచ్‌ గుబ్బల ఉషారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.పోడూరు మండల పరిషత్‌ సమా వేశ మందిరంలో ఆదివారం జరిగిన సర్పంచ్‌ల సమావేశంలో ఉషారాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ వాణీపెద్దిరాజు, వైసీపీ మండల కన్వీనర్‌ రుద్రరాజు శివాజీ రాజు, కార్యదర్శి వీరబ్రహ్మం, పోడూరి సత్యసాయి బాబా, సర్పంచ్‌లు పాల్గొన్నారు.