Abn logo
Jul 10 2020 @ 23:25PM

అరుణాచల్ ప్రదేశ్‌‌కు అన్ని విధాలా సాయమందిస్తాం: మోదీ

ఈటానగర్: వానలు, వరదలతో అతలాకుతలమౌతున్న అరుణాచల్ ప్రదేశ్‌కు అన్ని విధాలా సాయమందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వరదలతో పాటు కొండచెరియలు విరిగిపడటం వల్ల 8 మంది చనిపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. 

పాపుంపరే జిల్లాలోని టిగ్డో గ్రామంలో కొండచెరియలు విరిగిపడటం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. వీరిలో 8 నెలల చిన్నారి కూడా ఉంది. వీరంతా నిద్రలో ఉండగా కొండచెరియలు విరిగిపడ్డాయి. మరో ఘటన మోదిరిజోలో జరిగింది. కొండచెరియలు విరిగిపడి నలుగురు చనిపోయారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. రానున్న రోజుల్లోనూ అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 

Advertisement
Advertisement
Advertisement