Abn logo
Oct 25 2020 @ 17:24PM

ఫ్రెంచ్ అధ్యక్షుడిపై మండిపడ్డ పాక్ ప్రధాని!

Kaakateeya

ఇస్లామాబాద్: ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారంటూ మాక్రాన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విటర్‌లో వరుస ట్వీట్లతో నిప్పులు చెరిగారు. ఫ్రాన్స్‌లో మహ్మద్ ప్రవక్తపై కార్టూన్లు కొనసాగుతాయంటూ బుధవారం నాడు ఫ్రాన్‌ ప్రధాని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఇలా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు ఇస్లామ్ వ్యతిరేకతను పెంచేలా ఉన్నాయని తేల్చి చెప్పారు. ఇటువంటి కామెంట్ల ద్వారా అతివాదులకు మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఫ్రాన్స్‌కు చెందిన ఉపాధ్యాయుడు సామ్యుల్ పాటీ.. అతివాదుల చేతిలో మరణించిన విషయం తెలిసిందే. విద్యార్థులకు మహ్మద్ ప్రవక్తకు సంబంధించిన కార్టూన్లు చూపిస్తున్నారంటూ ఇస్లామిక్ అతివాదులు శామ్యూయెల్ పాటీని హత్య చేశారు. కాగా.. బుధవారం నాడు ఫ్రాన్స్‌లో ఆయన సంస్మరణ కార్యక్రమం జరగ్గా..అందులో పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి కార్టూన్లు ఫ్రాన్స్‌లో కొనసాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఫ్రాన్స్ భవిష్యత్తుపై ఇస్లామిక్ మత వాదులు కన్నేయడంతోనే శామ్యూయెల్ పాటీ మరణించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

Advertisement
Advertisement