Abn logo
Dec 22 2020 @ 12:51PM

ప్లాస్మా థెరపీ(PRP)తో...మోకాళ్ల నొప్పులకు చెక్‌ పెట్టండి

ఆపరేషన్‌ లేకుండా ప్లాస్మా థెరపీతో..

ఆంధ్రజ్యోతి(22-12-2020)

వయసు మళ్లిన వారిలో ఎక్కువగా కొన్ని రకాల అనారోగ్యాలు తరచుగా కనిపిస్తాయి. వారిలో సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్లనొప్పులు. ఈ సమస్య వారిలో జీవితం పట్ల నిరాశకు దారి తీస్తుంది. అటువంటి క్లిష్టపరిస్థితుల నుంచి ఉపశమనం పొందే విధంగా నూతన వైద్య విధానం ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా చికిత్స అందుబాటులో ఉంది. ఈ చికిత్సలో పేషెంట్‌ రక్తంలోని ప్లాస్మాను సంగ్రహించి ఈ సమస్యతో బాధపడుతున్న వారి మోకాలు భాగంలో ప్రవేశపెట్టి చికిత్స చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వారు సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొంది వారి జీవితంలో సరికొత్త ఆశ చిగురిస్తుంది.


మోకాళ్ల నొప్పులు మనం ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్య. ముఖ్యంగా వృద్ధులలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. యువకులలో క్రీడాకారులలో గాయాల వల్ల, స్థూలకాయుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య కీళ్ల ప్రాంతంలోని గాయాలు, స్నాయువు గాయాలు లేదా బుర్సిటిస్‌ వంటి వాటి వల్ల ప్రభావితమవుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌ అనేది మృదులాస్థి అరిగిపోవడం వల్ల సంభవిస్తుంది. వృద్ధాప్యంలో మృదులాస్థి అరుగుదల వల్ల అధిక బరువు మోకాలు భాగంలో నిర్దిష్టమయి ఈ సమస్య ఎక్కువవుతుంది.


ఈ సమస్య ఉన్న వారికి ప్రారంభ దశలో మెట్లు ఎక్కేటప్పుడు, నడిచినప్పుడు మోకాలు నొప్పి ఏర్పడు తుంది. ఆ తరువాత క్రమేపీ కీళ్ల వాపు, మోకాలు ఎర్రబడటం, బలహీనంగా తయారవడం ఆ తరువాత భరించలేని నొప్పి మోకాలు మొత్తం వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియ సుమారు 2-5 సంవత్సరాల వ్యవధిలో జరుగుతుంది. మోకాలు నొప్పి ప్రారంభంలో రోగలు ఫిజియోథెరపిస్ట్‌ సలహా మేరకు కొన్ని రకాల శారీరక వ్యాయామాలు చేస్తారు. మరికొందరు నొప్పి తగ్గడానికి పెయిన్‌ కిల్లర్లు వాడతారు. ఇలా చేయడం వల్ల తరువాతి దశలలో వారు పెయిన్‌ క్లిలర్‌లకు బానిస అవుతారు. ఈ మందులు ప్రారంభంలో కలిగే రోగలక్షణాల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటితో మూత్రపిండాలు పాడయ్యే ప్రమాదం ఉంది. ఇలా చేయడం వల్ల పూర్తిగా మోకాలుని మార్పిడిన చేయాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. 


ఈ సమస్యకి సమర్థమైన ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పిఆర్‌పి) చికిత్స అందుబాటులోకి వచ్చే వరకు మిగతా చికిత్సలు అంత ప్రభావాన్ని చూపించలేక పోయాయి. ఈ చికిత్స ద్వారా ఆపరేషన్‌ లేకుండానే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. రోగుల రక్తాన్ని (20మి.లీ) తీసుకుని, ఒక ప్రత్యేకమైన పరిజ్ఞానం కలిగిన పరికరంతో వృద్ధి కారకాన్ని సేకరిస్తారు. ప్లేట్‌లెట్స్‌లో చాలా వృద్ధి కారకాలు ఉన్నాయి. వీటిని దెబ్బతిన్న కణజాలంలోకి ఇంజెక్షన్‌ ద్వారా ప్రవేశపెడతారు. దెబ్బతిన్న కణజాలాన్ని రిపేర్‌ చేయడానికి ఇది సహాయపడుతుంది. ఈ చర్య ఆరోగ్యకరమైన కణజాలం పునరుత్పత్తి అయి క్షీణించిన మృదులాస్థితో చేరి దానిని ఆరోగ్యకరమైన కణజాలంతో మరమ్మతు చేయడానికి సహాయ పడుతుంది. ఈ విధానంలో మృదులాస్థి పూర్తి పునరుత్పత్తికి దాదాపు మూడు నెలలు పడుతుంది.


డా. సుధీర్‌ దారా

ఫౌండర్‌ అండ్‌ డైరెక్టర్‌  ఆఫ్‌ ఇపియాన్‌

4వ అంతస్తు, అపురూప పిసిహెచ్‌

రోడ్‌ నెం2, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌

ఫోన్‌ : 84660 44441, 040 48554444

epionepainandspine.com

[email protected]


Advertisement
Advertisement
Advertisement