Abn logo
Jul 12 2020 @ 03:55AM

హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలి

కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి


కొడంగల్‌/దౌల్తాబాద్‌/దోమ/కులకచర్ల : నాటిన మొక్కలను సంరక్షించాలని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్‌ పట్టణంలో శనివారం హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాటిన ప్రతీ మొక్క పెరిగే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌, మాజీ సర్పంచ్‌ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. దౌల్తాబాద్‌ మండలం నర్సాపూర్‌, నాగసార్‌, తిర్మాలాపూర్‌, సుల్తాన్‌పూర్‌ గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పట్నంనరేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. సుల్తాన్‌పూర్‌లో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తేగా, పరిష్కారానికి హామీ ఇచ్చారు.


కొందరికి రైతు బంధు డబ్బులు అందలేదని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌, తహసీల్దార్‌ వెంకటేశ్‌, ఎంపీడీఓ తిరుమలస్వామి, నాయకులు మోహన్‌రెడ్డి, ప్రమోద్‌రావు తదితరులు పాల్గొన్నారు. దోమ మండలం బొంపల్లి గ్రామంలోని నాగిరెడ్డికుంట గట్టుపై శనివారం పరిగి ఎక్సైజ్‌ సీఐ చంద్రశేఖర్‌ ఈత మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సురేష్‌, ఎస్‌ఐ షాకీర్‌ అహ్మద్‌, వార్డు సభ్యులు చంద్రశేఖర్‌, శ్రీలత, శ్రీనివాస్‌, సురేష్‌, జానీ, ఎక్సైజ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కులకచర్ల మండలం మందిపాల్‌ గ్రామంలో సర్పంచ్‌ మఠం ప్రమీల ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున మహిళలకు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో రేషన్‌ డీలర్‌ రాజశేఖర్‌, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement