Jun 17 2021 @ 10:05AM

'నారప్ప' రిలీజ్‌కి సన్నాహాలు..!

విక్టరీ వెంకటేష్‌ - ప్రియమణి జంటగా నటిస్తున్న సినిమా 'నారప్ప'. ఈ సినిమా రిలీజ్‌కి సన్నాహాలు మొదలైనట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన 'నారప్ప' మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. అయితే, కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో పోస్ట్‌పోన్ చేశారు. పరిస్థితులు కాస్త అదుపులోకి వస్తుండటంతో వచ్చే నెలనుంచి థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. దాంతో నారప్ప సినిమా భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరో వారం రోజుల్లో ఫస్ట్‌ కాపీ పూర్తి అవుతుందని, రిలీజ్ డేట్ విషయమై చర్చచలు సాగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారట. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌, పోస్టర్స్‌, టీజర్‌ బాగా ఆకట్టుకున్నాయి. సురేష్‌ బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మించిన ఈ సినిమాలో వైవిధ్యమైన షేడ్స్‌ ఉన్న పాత్రలో వెంకీ అలరించనున్నాడు. ఇక ఈ సినిమాను తమిళంలో సూపర్ హిట్ అయిన 'అసురన్‌'కి రీమేక్‌గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.