Aug 3 2021 @ 15:53PM

‘ప్లాన్ బి’ విడుదల తేదీ ఫిక్సయింది

ఏవిఆర్ మూవీ వండర్స్ పతాకంపై శ్రీనివాస్ రెడ్డి హీరోగా సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, నవీనారెడ్డి ముఖ్య తారాగణంగా.. కెవి రాజమహి దర్శకత్వంలో ఏవిఆర్ నిర్మించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ప్లాన్-బి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగస్ట్ 20న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాతలు సినిమా విడుదల గురించి మీడియాకు తెలియజేశారు. 


‘‘ప్లాన్ బి.. చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠతతో థ్రిల్లింగ్ అంశాలతో సాగుతుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు. అలా ఉంటుందీ చిత్రం. మా చిత్రాన్ని సెన్సార్ వారు ప్రశంసించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సెన్సార్ నుంచి యుఏ సర్టిఫికెట్ వచ్చింది. అందరూ ఎంతగానో సహకరించారు. అందరికీ ధన్యవాదాలు’’ అని చిత్ర దర్శకుడు కెవి రాజమహి తెలుపగా.. ‘‘సెన్సార్ వారి ప్రశంసలతో పాటు యుఏ సర్టిఫికెట్ పొందిన మా ప్లాన్ బి చిత్రాన్ని ఆగస్ట్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా రాజమహి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటివరకు తెలుగు తెరపై ఇటువంటి ఉత్కంఠ భరిత చిత్రం రాలేదని కచ్చితంగా చెప్పగలను..’’ అని నిర్మాత ఏవిఆర్ అన్నారు.