Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ ఎమ్మెల్యేలు DNA పరీక్షలు చేయించుకోవాలి: పీతల సుజాత

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ గురించి మాట్లాడే వైసీపీ ఎమ్మెల్యేలు డీఎన్ఏ పరీక్షలు  చేయించుకోవాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్లి వాళ్ల ఆడవారితో డీఎన్ఏ పరీక్షలకు వెళదామని చెప్తే బాగుంటుందన్నారు. పదేళ్ళు టీడీపీలో ఉన్న రోజాకు ఎవరు ఎలాంటివారో తెలియదా? అని ప్రశ్నించారు. ఆనాడు సీతను అవమానించిన రావనాసురుడికి ఏ గతి పట్టిందో ఇవాళ భువనేశ్వరిని అవమానించిన వైసీపీకి అదే గతి పడుతుందన్నారు. అమ్మ లాంటి నారా భువనేశ్వరి గురించి అలా మాట్లాడితే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని పీతల సుజాత నిలదీశారు.

Advertisement
Advertisement